అభిజిత్‌ది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌: దివి

Bigg Boss 4 Telugu: Divi Vadthya Cooments On BB Journey - Sakshi

సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి దివి వైద్య బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ నుంచి ఈ మ‌ధ్యే ఎలిమినేట్ అయింది. మాట‌ల క‌న్నా చేత‌ల‌కు ప్రాధాన్య‌మిచ్చింది. ఈ షో ద్వారా త‌న భ‌విష్య‌త్తును నిర్మించుకోవాల‌ని క‌ల‌లు కంది. నాగార్జున ద‌గ్గ‌ర వీడ్కోలు తీసుకోకుండానే షో నుంచి వెళ్లిపోయింది. దివి ఎలిమినేట్ అయింద‌న్న విష‌యాన్ని ఆమె అభిమానులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ  నేప‌థ్యంలో దివి త‌న బిగ్‌బాస్ జ‌ర్నీ గురించి ఎన్నో విశేషాల‌ను పంచుకుంది. ఈ మేర‌కు ఓ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. అందులో దివి మాట్లాడుతూ..

ప‌ప్పు వ‌ల్ల వార‌మంతా స‌ఫ‌ర్ అయ్యాం
బ‌య‌ట‌కు వ‌చ్చేస్తా అనుకోలేదు. ద‌స‌రా రోజే ఎలిమినేట్ కావ‌డం బాధ‌నిపించింది. అయితే నేను ఎలా వెళ్లానో అలానే బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. బిగ్‌బాస్ హౌస్ అనేది ఒక క‌ల‌, డ్ర‌గ్‌. అందులో ఎప్పుడేం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. లాస్య అక్క‌తో నాకంత క‌నెక్ష‌న్ లేదు. పైగా అప్ప‌టికే మాకు చాలా గొడ‌వ‌ల‌య్యాయి. వాట‌న్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌తో నేను స్వ‌యంగా నామినేష‌న్‌లోకి వ‌చ్చాను. ఆమె ఇంట్లో అంద‌రికీ వంట చేసి పెడుతుంది. అలాంటి వ్య‌క్తిని ఇంకా బాధ‌పెట్టి ఏడిపించ‌ద‌ల్చుకోలేదు. అంత‌కు ముందు జ‌రిగిన నామినేష‌న్‌లో ప‌ప్పు కార‌ణంతో ఆమెను నామినేట్ చేయ‌డం అంద‌రూ సిల్లీ అనుకుంటున్నారు. కానీ ఆరోజు అక్క వండిన ప‌ప్పు వ‌ల్ల నేను, మోనాల్‌, సుజాత‌, కుమార్ సాయి కాస్త అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాం. విరేచ‌నాలు, వాంతింగులతో వార‌మంతా ఇబ్బంది ప‌డ్డాం. చివ‌రికి ఓఆర్ఎస్ తాగాల్సి వ‌చ్చింది. అందుకే నేను ప‌ప్పు రీజ‌న్ చెప్పాను. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో మ‌న శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. (చద‌వండి: బిగ్‌బాస్ హోస్టింగ్‌పై స‌మంత మ‌న‌సులోని మాట‌)

మొద‌ట్లో సైలెంట్‌గా ఎందుకు ఉన్నానంటే..
హౌస్‌లోకి అడుగు పెట్ట‌గానే చాలా మంది ఏడుస్తున్నారు. ఒక‌రికొక‌రు తినిపించుకుంటున్నారు. తొలిరోజే అంద‌రూ చిత్ర‌విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం నాకు ఆశ్చ‌ర్యంగా అనిపించింది. అందుక‌ని మూడు రోజుల వ‌ర‌కు అంద‌రినీ ఓ కంట‌ గ‌మ‌నిస్తూ సైలెంట్‌గా ఉండిపోయా. దానివ‌ల్లే మార్నింగ్ మ‌స్తీలో అంద‌రిగురించి క‌రెక్ట్‌గా చెప్ప‌గ‌లిగా. ఇక  ఒక న‌టిగా నేను అందంగా క‌నిపించాలి. చిన్న గాయం త‌గిలినా అది ఎఫెక్ట్ అవుతుంది. మా అమ్మ నాకు ఏదైనా దెబ్బ త‌గులుతుంద‌ని బైక్ కూడా కొనివ్వ‌లేదు. కాబ‌ట్టి ఫిజిక‌ల్ టాస్కులో కాళ్లు విర‌గ్గొట్టుకునేందుకు నేను హౌస్‌కు వెళ్ల‌లేదు. అయితే ఫిజిక‌ల్ టాస్కులంటే నేను భ‌య‌ప‌డ‌తాన‌ని సుజాత చెప్ప‌డంతో పేడ తొట్టిలే కూర్చునే టాస్క్‌ను మ‌రో ఆలోచ‌న లేకుండా పూర్తి చేశా. మూడు గంట‌లు దానిలో కూర్చోవ‌డం నేను జీవితంలో మ‌ర్చిపోలేను. (చద‌వండి: న‌డ‌వ‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతున్న నోయ‌ల్‌)

అభిజిత్ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌
హౌస్‌లో ఎవ‌రితో పెద్ద‌గా క‌నెక్ష‌న్ లేదు. అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో త‌ప్ప‌! ఆయ‌న నాపై చూపించే కేరింగ్ నిజ‌మ‌ని న‌మ్మాను. కానీ అత‌ని వ‌ల్ల నేను, నా గేమ్‌ ప్ర‌భావితం అయితే కాలేదు. ఒక‌వేళ  ఆయ‌న నా వెన‌కాల ఏదైనా త‌ప్పుగా మాట్లాడితే మాత్రం క‌చ్చితంగా ఖండిస్తాను. అత‌నితోనే ఉండ‌టం వెన‌క ఎలాంటి ఉద్దేశ్య‌మూ లేదు. ఇక త‌న‌ను జ‌నాలు సేవ్ చేస్తార‌ని అభిజిత్ కాన్ఫిడెంట్‌తో ప‌డ‌వ టాస్కులో నుంచి దిగేయ‌డం నాకు న‌చ్చ‌లేదు. నాగార్జున స‌ర్‌ కూడా ఇదే పాయింట్‌ను ప్ర‌స్తావించారు. చివ‌రికి స‌మంత చేతుల మీదుగా వీడ్కోలు తీసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఎలిమినేష‌న్ త‌ర్వాత కంటెస్టెంట్ల‌తో టెలిఫోన్‌లో సంభాషించాను. కానీ అది ఎందుకు టెలికాస్ట్ చేయ‌లేదో తెలియ‌దు. బిగ్‌బాస్‌కు ముందు నాకు సీరియ‌ల్స్‌లో అవ‌కాశం వ‌చ్చింది. కానీ టీవీ క‌న్నా సినిమాలు, వెబ్ సిరీస్‌ల మీదే నాకు ఫోక‌స్ ఉంది. ఇక హౌస్‌లో సినిమా చేసిన టాస్క్ ఉంది క‌దా.. అందులో అఖిల్‌, మోనాల్ మ‌ధ్య రొమాంటిక్ సీన్‌ల‌ను నేనే డైరెక్ట్ చేశాను. కానీ బ‌య‌ట మాత్రం నాకు న‌టిగా మంచి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాను అని దివి చెప్పుకొచ్చింది.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-11-2020
Nov 28, 2020, 23:46 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం చివ‌రి మ‌జిలీకి చేరుకుంటున్న ద‌శ‌లో కొంద‌రి గ్రాఫ్ త‌గ్గుతోంటే మ‌రికొంద‌రి గ్రాఫ్ పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో...
28-11-2020
Nov 28, 2020, 23:12 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోనే ఈ వారం అత్య‌ధికంగా 9.5 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని నాగ్ స‌గ‌ర్వంగా వెల్ల‌డించారు. అలాగే గుంటూరులో...
28-11-2020
Nov 28, 2020, 20:58 IST
బిగ్‌బాస్ క‌థ కంచికి చేరుతోంది. ఇప్పుడున్న ఏడుగురిలో ఐదుగురికే టాప్ 5లో చోటు దొరుకుతుంది. ఫైన‌ల్‌లో చోటు ద‌క్కించుకునేందుకు కంటెస్టెంట్లు...
28-11-2020
Nov 28, 2020, 17:59 IST
బిగ్‌బాస్ షో అంటే ఒక మ‌నిషి ఎలా ఉంటాడో చూపించ‌డ‌మే కాదు. అత‌డి శ‌క్తి సామ‌ర్థ్యాలు కూడా వెలికి తీస్తూ...
28-11-2020
Nov 28, 2020, 16:53 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ఫినాలేలో చోటు ద‌క్కించుకునేందుకు రేసు మొద‌లైంది. కంటెస్టెంట్లు బంధాలు, అనుబంధాల‌ను ప‌క్క‌కు నెట్టి పూర్తిగా గేమ్‌పైనే...
28-11-2020
Nov 28, 2020, 15:56 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అడుగుపెట్టిన ఉత్త‌రాది ముద్దుగుమ్మ మోనాల్ గ‌జ్జ‌ర్ ఎప్పుడూ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది....
27-11-2020
Nov 27, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్‌ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది....
27-11-2020
Nov 27, 2020, 18:35 IST
టెలివిజన్‌ బిగ్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’కు లభించిన ఆదరణ మరే ఇతర షోలకు లభించదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో గత...
26-11-2020
Nov 26, 2020, 23:24 IST
నిన్నటి ఎపిసోడ్‌లో దెయ్యం మాటల్ని లెక్క చేయలేదు ఇంటి సభ్యులు. పైగా దెయ్యంపైనే జోకులు వేస్తూ పగలబడి నవ్వారు. దీంతో...
26-11-2020
Nov 26, 2020, 20:16 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ బిగ్‌ రియాల్టీ షోకు శుభం కార్డు పడటానికి మరో నాలుగు...
26-11-2020
Nov 26, 2020, 17:09 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. షో ముగింపునకు మరో 24 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్‌ని...
26-11-2020
Nov 26, 2020, 16:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి దెయ్యం ఎపిసోడ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హౌస్‌మేట్స్‌ని భయపెట్టడంతో దెయ్యం విఫలమైంది. అరియానా మొదట్లో కాస్త భయపడినా.....
25-11-2020
Nov 25, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి దెయ్యం వచ్చింది. వింత వింత శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.అంతటితో ఆగకుండా హౌస్‌మేట్స్‌...
25-11-2020
Nov 25, 2020, 16:50 IST
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల...
25-11-2020
Nov 25, 2020, 15:52 IST
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది.
24-11-2020
Nov 24, 2020, 22:48 IST
ఇప్ప‌టి నుంచి హారిక‌ను జీవితంలో మ‌ర్చిపోలేను, ఆమెను అమ్మ అని పిలుస్తా..
24-11-2020
Nov 24, 2020, 16:45 IST
ఆదివారం వ‌ర‌కు స్నేహ‌గీతాలు పాడుకునే కంటెస్టెంట్లు సోమ‌వారం నాడు మాత్రం ఏదో పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా శివాలెత్తుతారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక‌రి మీద...
24-11-2020
Nov 24, 2020, 15:27 IST
ప‌న్నెండో వారానికి గానూ జ‌రిగిన నామినేష‌న్స్‌తో బిగ్‌బాస్ హౌస్ క‌కావిక‌లం అయింది. ఒక‌ర్ని విడిచి ఒక‌రం ఉండ‌లేం అన్న‌ట్లుగా ఉండే జంట...
23-11-2020
Nov 23, 2020, 23:24 IST
పోయిన‌సారి నామినేష‌న్ అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మ‌ధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్ద‌రి...
23-11-2020
Nov 23, 2020, 20:17 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభానికి ముందు నుంచే ఈ షోకు లీకుల బెడ‌ద ప్రారంభ‌మైంది. సీజ‌న్ ప్రీమియ‌ర్ ఎపిసోడ్‌కు ముందే ఎవ‌రెవ‌రు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top