‘భారతీయన్స్’ టీజర్‌ బాగుంది: సురేశ్‌ బాబు | Bharateeyans Movie Teaser Launched By Suresh Babu | Sakshi
Sakshi News home page

‘భారతీయన్స్’ టీజర్‌ బాగుంది: సురేశ్‌ బాబు

May 5 2023 6:44 PM | Updated on May 5 2023 6:44 PM

Bharateeyans Movie Teaser Launched By Suresh Babu - Sakshi

ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్‌ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఫేమ్‌) దీన్‌ రాజ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్‌’.   నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత  నిర్మించారు.

(చదవండి: యంగ్‌ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్‌)

తాజాగా ఈ చిత్రం టీజర్‌ని ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌ బాబు రిలీజ్‌ చేసి, చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.  తమ సంస్థకు "ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా" వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న "భారతీయన్స్" బిగ్గెస్ట్ బ్లస్టర్ కావాలని ఆకాంక్షించారు. 

(చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!)

దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ ''దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే చిత్రమిది. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు అందుకున్న మా చిత్రం టీజర్ ను  సురేష్ బాబు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది'అని అన్నారు.

హీరో నీరోజ్ మాట్లాడుతూ ''హీరోగా నాకు ఫస్ట్ సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్ గారికి, దర్శకులు దీన్ రాజ్ గారికి థాంక్స్'' అని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సత్య కశ్యప్ & కపిల్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement