Vidiyum Varai Kaathiru 2022 Poster Relaese: 'విడియుమ్‌ వరై కార్తిరు' టైటిల్‌ పోస్టర్‌ విడుదల

Bhagyaraj Release Vidiyum Varai Kaathiru 2022 Poster - Sakshi

చెన్నై సినిమా: లిబ్రా ప్రొడక్షన్స్‌ పతాకంపై వీసీ రవీంద్రన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రానికి 'విడియుమ్‌ వరై కార్తిరు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో విద్యార్థి విక్రాంత్, కార్తీక్‌ కుమార్, మహాలక్ష్మి శంకర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. 

ఈ చిత్రం ద్వారా ముండాసిపట్టి, రాక్షసన్‌ చిత్రాల దర్శకుడు రామ్‌కుమార్‌ శిష్యుడు బాజీ సలీమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను శనివారం దర్శకుడు భాగ్యరాజ్‌ ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి కోయంబత్తూరులో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి అనంతరం సూపర్‌ ఫాస్ట్‌గా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

చదవండి: బేబీ బంప్‌తో అలియా భట్‌ !.. లీకైన ఫొటోలు..
తనకన్నా చిన్నవాడితో హీరోయిన్‌ డేటింగ్‌, ఇద్దరు పుట్టాక పెళ్లి !
ఇది ఎవరికీ తెలియదనుకుంటా: నాగార్జున

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top