
స్నేహాన్ని కూడా ప్రేమగా ముద్ర వేస్తున్నారు. పెళ్లయ్యాక అబ్బాయితో స్నేహాన్ని కొనసాగిస్తే దానికి రకరకాల పేర్లు పెట్టి తనను విమర్శించారంటోంది హిందీ బుల్లితెర నటి బర్కా బిష్త్ (Barkha Bisht). బుల్లితెరపై అనేక సీరియల్స్ చేసిన ఈమె పీఎమ్ నరేంద్రమోదీ, 1920: హారర్స్ ఆఫ్ ద హార్ట్, సేఫ్‌డ్, ఖదాన్ వంటి పలు చిత్రాలతో వెండితెరపైనా మెరిసింది. 2008లో నటుడు ఇంద్రనీల్ సేన్‌గుప్తాను పెళ్లాడగా వీరికి ఓ కూతురు పుట్టింది. 2022లో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం నటుడు, నిర్మాత ఆశిష్ శర్మతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి!
కొందరు స్పెషల్
తాజాగా బర్క బిష్త్ మాట్లాడుతూ.. కరణ్ (Karan Veer Mehra), నేను ఏళ్లతరబడి స్నేహాన్ని కొనసాగిస్తున్నాం. కానీ, జనాలు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. మా మధ్య ఏదో ఉందన్నట్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ మన జీవితంలో మనకంటూ స్పెషల్ అనేవాళ్లుంటారు. అలా నా లైఫ్‌లో నాకు కరణ్ వీర్ మెహ్రా ఉన్నాడు. మా గురించి ఎప్పుడూ ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. జనాలు నన్ను విమర్శిస్తూనే ఉంటారు.
దారుణమైన ట్రోలింగ్
ముఖ్యంగా బిగ్‌బాస్ షోలో కరణ్‌ను సపోర్ట్ చేయడానికి వెళ్లినప్పుడు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. కరణ్ వెంట తిరుగుతున్నందుకే నా పెళ్లి పెటాకులైందని తిట్టిపోశారు. అతడు, నేను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు.. అసలు దీనికి నీ భర్త ఎలా ఒప్పుకున్నాడు? అంటూ ఆగ్రహించేవారు అని చెప్పుకొచ్చింది.
డేటింగ్.. అంత టైం లేదు
ఆశిష్‌తో లవ్ రూమర్స్‌పై స్పందిస్తూ.. కష్ట సమయంలో అతడు నాకు కనెక్ట్ అయ్యాడు. జనాలు మేము డేటింగ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. నిజంగా ప్రేమలో ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం నా దృష్టంతా నా 13 ఏళ్ల కూతురు మైరాపైనే ఉంది. ప్రేమ పాటలు పాడుకునేంత ఆసక్తి, సమయం లేదు అని బర్క పేర్కొంది.
చదవండి: బ్యాంకాక్‌లో భూకంపం.. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి