చిరంజీవిపై బండ్ల గణేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు, ట్వీట్‌ వైరల్‌!

Bandla Ganesh Tweet On Chiranjeevi Goes Viral - Sakshi

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ మెగాస్టార్‌ చిరంజీవిపై చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.  కాగా బండ్ల మెగా అభిమాని అని అందరికి తెలిసిందే. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ అంటే బండ్లకు బాగా ఇష్టం. ఇటీవల పవన్‌కు దేవర అనే పేరును కూడా పెట్టుకున్నాడు. అలా ఏ వేడుక అయినా స్టేజ్‌ ఎక్కాడంటే చాలు సమయం సందర్భంగా లేకుండా దేవర, దేవర అంటూ పవన్‌ భజన చేస్తుంటాడు.

కానీ ఈ సారి మెగాస్టార్‌ చిరంజీవిపై తన అభిమానాన్ని కురిపించాడు. చిరు ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మా దేవరకి అన్న.. అందరికి నేను అనే నమ్మకం. మనిషి అంటే ఇలా ఉండాలి.. అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న మెగాస్టార్‌’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశాడు. అయితే ఈ ట్వీట్‌ను బండ్ల ఏ సందర్భంగా చేశాడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. అయితే బండ్ల గణేశ్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా సామాజిక మాధ్యామాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం కాకుండా.. పేద ప్రజలకు సాయం అందించేందుకు వాడుతున్నాడు.

ట్విటర్‌ ద్వారా తనను అభ్యర్థిస్తే చాలు... వెంటనే స్పందించి, తోచిన సాయం అందిస్తుంటాడు. ఈ ​క్రమంలో ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతుందని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ,  వీలైన సాయం చేయాల్సిందిగా ట్వీటర్‌ ద్వారా అందరినీ అభ్యర్థించాడు. దీనిపై బండ్ల స్పందిస్తూ.. `మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామ`ని ట్వీట్‌ చేశాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top