Arya 3 Hero Name: Do You Know Who is Going to Replace With Allu Arjun In Arya 3 Movie - Sakshi
Sakshi News home page

Arya 3 Hero: త్వరలోనే ఆర్య 3.. హీరో బన్నీ కాదట, మరి ఎవరు?

Oct 19 2021 4:40 PM | Updated on Oct 19 2021 5:04 PM

Arya 3: Do you know Who is Going to Replace Allu Arjun - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఆర్య, ఆర్య2 చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బన్నీకి స్టైలిష్ స్టార్ అన్న పేరు రావ‌డానికి కార‌ణం `ఆర్య` సిరీస్ అనడంలో సందేహం లేదు. త్వరలోనే ఆర్య3తో తిరిగి రానున్నట్లు సుకుమార్‌ ఇటీవలె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో  అల్లు అర్జున్ మరో క్రేజీ సీక్వెల్ కు డేట్స్ కేటాయించాడని ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేశారు. కాని సుకుమార్ ,బన్ని ప్లానింగ్ వేరే ఉంది. ఆర్య3లో అల్లు అర్జున్ స్థానంలో మరో హీరోని ఎంపిక చేయనున్నారట. ఈసారి ఆర్య పాత్రలో అర్జున్ రెడ్డిని చూపిస్తాడట.అందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.


విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే ఓ మూవీ లాక్ అయింది. ఆ మూవీనే ఆర్య 3 అని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం లైగర్ షూటింగ్ లో దేవరకొండ, పుష్ప  షూట్‌లో సుకుమార్ బిజీగా ఉన్నారు.ఈ సినిమాలు పూర్తైన తర్వాత ఆర్య3పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement