Kinnera Mogulaiah: నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా..

Artist Kinnera Mogulaiah Shocking Statement On Padma Shri Award - Sakshi

తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న ఏకైక కళాకారుడు మొగులయ్య. గ్రామాల్లో అక్కడా ఇక్కడా కిన్నెర వాయించుకుంటూ పొట్ట నింపుకున్న అతడు భీమ్లా నాయక్‌ టైటిల్‌ సాంగ్‌తో ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యాడు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో మొగులయ్యను సత్కరించింది. అయితే తాజాగా అతడు తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు.

'నన్ను ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. మొన్నామధ్య పాట పాడితే పద్మశ్రీ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. హైదరాబాద్‌లో 300 గజాల స్థలం, కోటి రూపాయలు ఇచ్చారు. అయితే బీజేపీ వాళ్లు ముఖ్యమంత్రి తన ఇంట్లో నుంచి కోటి రూపాయలు ఇస్తున్నడా? అని నాతో గొడవపడ్డారు. పద్మశ్రీ బీజేపీ వాళ్లదంట. నాకు ఆ పతకం అవసరం లేదు. నాకు ఎందుకీ బద్నాం.. పద్మశ్రీ ఎవరిదైనా సరే అది తిరిగి ఇచ్చేస్తా. కానీ పేదోడిని అయిన నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతది' అని ఆవేదన వ్యక్తం చేశాడు మొగులయ్య.

చదవండి 👇

ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే?

 'మహేశ్‌బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు' అంటున్నారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top