రామ్‌గోపాల్‌ వర్మను కలిసిన బోల్డ్‌ బ్యూటీ

Ariyana Glory Finally Met Ram Gopal Varma In Goa - Sakshi

బిగ్‌బాస్‌ భామ, సన్నజాజి తీగ అరియానా గ్లోరీ బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ తర్వాత ఫుల్‌ బిజీగా మారింది. ఇంటర్వ్యూలతో, మాల్స్‌ ఓపెనింగ్స్‌తో, పార్టీలతో క్షణం తీరిక లేకుండా పోయింది. పనిలో పనిగా ఓ సినిమాకు సంతకం కూడా చేసిన విషయం తెలిసిందే. "సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు" ఫేమ్‌ శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌తో కలిసి నటిస్తోంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్‌ చేసింది. కాగా ముక్కుసూటి వైఖరితో, ఎవరినైనా ఎదిరించే ధైర్యంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆమె ఎలాగైనా బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలుద్దామని ధృడంగా నిశ్చయించుకుంది, కానీ ఆమె కల నెరవేరలేదు. అయినప్పటికీ బోలెడంత మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఆమెకు ఆర్జీవీ కూడా ఓ అభిమానే!

అవును, బిగ్‌బాస్‌కు ముందు కూడా అరియానా యూత్‌కు సుపరిచితురాలే. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేసిన వీడియో అప్పట్లో వైరల్‌ కావడంతో ఆమె బాగా ఫేమస్‌ అయింది. దీంతో ఆమె బిగ్‌బాస్‌లో అడుగు పెట్టడానికి కారణం ఓ రకంగా ఆర్జీవీనే అన్న వార్తలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో వర్మ ఆమెకు ఓటేయమంటూ సోషల్‌ మీడియా వేదికగా మద్దతు తెలపడం విశేషం. అంతే కాదు వీలైతే అరియానాతో సినిమా తీసేందుకు సిద్ధమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అయితే మొత్తానికి వీళ్లిద్దరూ సమావేశమయ్యారు. గోవాలో శ్రీముఖి, విష్ణుప్రియ, ఆర్జే చైతు, సుశ్రుత్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న అరియానా తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మను కలిసింది. ఈ మేరకు అతడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తనకోసం సమయం కేటాయించినందుకు ఆర్జీవీకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో వర్మ ఆమెతో సినిమా తీస్తానన్న మాట గురించి ప్రస్తావించాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. (చదవండి: )

(చదవండి: హీరోయిన్‌గా బిగ్‌బాస్‌ బోల్డ్‌ బ్యూటీ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top