Arbaaz Khan Recalls Being Stressed About Money, Career, Relationships - Sakshi
Sakshi News home page

Arbaaz Khan: రిలేషన్‌ సహా ఆ విషయాల్లో చాలా ఒత్తిడికి లోనయ్యా: సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు

Nov 7 2022 9:44 PM | Updated on Nov 8 2022 9:49 AM

Arbaaz Khan Reveals He Stressed about Money, Career, Relationships - Sakshi

పని గురించో, డబ్బు గురించో, రిలేషన్‌షిప్‌ గురించో లేదంటే ఆరోగ్యం గురించైనా కావచ్చు. అలా నిత్యం ఏదో ఒకదాని కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం.

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ తాజాగా తనావ్‌(ఒత్తిడి) అనే వెబ్‌ సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్‌ ఈ నెల 11 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానుంది. సిరీస్‌ ప్రమోషన్లలో భాగంగా అతడు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తను ఒత్తిడి గురించి చెప్పుకొచ్చాడు. మనం నిత్యం ఒత్తిడితో సతమతమవుతూనే ఉంటాం. జీవితంలో ఒత్తిడికి లోనవని సందర్భాలంటూ ఉండవు. ఎప్పుడూ మన మెదడులో ఏదో ఒక స్ట్రెస్‌ ఉండనే ఉంటుంది. పని గురించో, డబ్బు గురించో, రిలేషన్‌షిప్‌ గురించో లేదంటే ఆరోగ్యం గురించైనా కావచ్చు. అలా నిత్యం ఏదో ఒకదాని కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం.

ఈ క్రమంలో జీవితమంతా కాస్తో కూస్తో ఒత్తిడికి లోనవుతూనే ఉంటాం. కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేసుకుంటున్నామన్నదే ముఖ్యం. చిన్నవయసులో నేను చాలా వాటి కోసం టెన్షన్‌ పడేవాడిని. 20 ఏళ్ల వయసులో కెరీర్‌ గురించి, తర్వాత జీవితం గురించి.. ఇలా ఒత్తిడి అనేది ఏదో ఒక రూపంలో మన ముందుకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను అన్నింటినీ స్వీకరిస్తూ ఏది జరిగినా మనమంచికే అనుకుని ముందుకు వెళ్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అర్బజ్‌.. దబాంగ్‌ సినిమాతో నిర్మాతగా మారాడు. 1998లో సీనియర్‌ నటి మలైకా అరోరాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2002లో అర్హాన్‌ ఖాన్‌ జన్మించాడు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ జంట 2017లో విడాకులు తీసుకుంది.

చదవండి: నేనెక్కడికీ వెళ్లలేదు, తిరిగొస్తా: విజయ్‌ దేవరకొండ
చచ్చేదాకా రుణపడి ఉంటా: గీతూ రాయల్‌ పోస్ట్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement