బ్రేకప్‌ చెప్పి నెలరోజులు కాలేదు.. అప్పుడే మరో పెళ్లా? | Is Arbaaz Khan to Marry Makeup Artist Shura Khan? | Sakshi
Sakshi News home page

Arbaaz Khan: విడాకులు, బ్రేకప్‌.. ముచ్చటగా మూడోసారి లవ్‌లో పడ్డ సల్మాన్‌ సోదరుడు!

Dec 21 2023 4:25 PM | Updated on Dec 21 2023 7:17 PM

Is Arbaaz Khan to Marry Makeup Artist Shura Khan? - Sakshi

ఈ క్రమంలో సినిమా సెట్స్‌లో షురా, అర్బాజ్‌ల మధ్య పరిచయం, ప్రేమగా మారినట్లు భోగట్టా! కాగా అర్బాజ్‌ ఖాన్‌.. గతంలో ఐటం గర్ల్‌, నటి మలైకా అరోరాను 1998లో పెళ్లి చేసు

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. మేకప్‌ ఆర్టిస్ట్‌ శురా ఖాన్‌ను డిసెంబర్‌ 24న పెళ్లాడబోతున్నట్లు బీటౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వివాహ వేడుక ముంబైలో ఇరుకుటుంబసభ్యులు, అతిదగ్గరి బంధుమిత్రుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక అర్బాజ్‌ గతేడాది  పాట్నా శుక్ల అనే సినిమా చేశాడు. ఈ మూవీలో అనుష్క కౌశిక్‌, రవీనా టండన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సెట్స్‌లో పరిచయం..
ఇకపోతే రవీనా టండన్‌కు షురా మేకప్‌ ఆర్టిస్ట్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా సెట్స్‌లో షురా, అర్బాజ్‌ల మధ్య పరిచయం ఏర్పడగా అది తర్వాత ప్రేమగా మారినట్లు భోగట్టా! కాగా అర్బాజ్‌ ఖాన్‌.. గతంలో ఐటం గర్ల్‌, నటి మలైకా అరోరాను పెళ్లి చేసుకున్నాడు. ఏళ్ల తరబడి అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత అర్బాజ్‌.. నటి జియార్జియా ఆండ్రియానితో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇటీవలే బ్రేకప్‌ చెప్పుకుంది.


జియార్జియా ఆండ్రియాని, అర్బాజ్‌

ప్రేమికులుగా బ్రేకప్‌.. ఫ్రెండ్స్‌గా ఉంటాం..
ఈ విషయాన్ని జియార్జియా సైతం మీడియాకు ధ్రువీకరించింది. అయితే తాము మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని చెప్పింది. అయితే వీరు విడిపోయినట్లు ప్రకటించి నెలరోజులైనా కాకముందే అర్బాజ్‌ మరోసారి ప్రేమలో పడ్డాడు, పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు.. ఏది నిజం? ఏది అబద్ధం? తెలియక జుట్టు పీక్కుంటున్నారు. మరి దీనిపై అ‍ర్బాజ్‌ స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు వచ్చేలా లేదు!

చదవండి: రైతుబిడ్డకంత నాలెడ్జ్‌ లేదు.. మానసిక క్షోభ అంటూ ఏడ్చేసిన సింగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement