కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్‌లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

తమిళ్‌లో 'అరణ్మనై 4' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'బాక్' టైటిల్‌తో విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమా త్వరలో హాట్‌స్టార్‌లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించకుండా త్వరలో రిలీజ్ చేస్తామని హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
விரைவில் 🔥
Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024
కానీ, జూన్ 7న బాక్ విడుదల కానున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.


