షారుక్‌తో సినిమా.. తన వల్ల కాదన్న స్టార్‌ డైరెక్టర్‌! | Anurag Kashyap gives clarity why he cant work with Sharukh khan | Sakshi
Sakshi News home page

Anurag Kashyap: షారుక్‌తో సినిమా.. వారి వల్లే భయమన్న అనురాగ్!

Published Wed, Jun 5 2024 7:13 PM | Last Updated on Wed, Jun 5 2024 7:42 PM

Anurag Kashyap gives clarity why he cant work with Sharukh khan

బాలీవుడ్ డైరెక్టర్‌  అనురాగ్ కశ్యప్ స్టార్‌ హీరోపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనురాగ్ కశ్యప్.. షారుక్‌ ఖాన్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సరిచ్చారు. మీరు షారుక్‌తో కలిసి ఎందుకు పని చేయలేదని ఆయను ప్రశ్నించగా.. అనురాగ్ స్పందించారు. అతనికున్న స్టార్‌ క్రేజ్‌, అభిమానులను చూసి తాను భయపడుతున్నట్లు తెలిపారు.  షారుక్ ఫ్యాన్స్‌ అంచనాలను అందుకునే సామర్థ్యం తనకు లేదన్నారు.

అనురాగ్ మాట్లాడుతూ..'సోషల్ మీడియా యుగంలో పెద్ద పెద్ద స్టార్స్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. వారి క్రేజ్‌ చూస్తే నాకు భయం. స్టార్‌ హీరోల అభిమానులకు తమ నటుడిపై భారీ అంచనాలు ఉంటాయి. ప్రతిసారి ఫ్యాన్స్‌ వారి నుంచి మళ్లీ మళ్లీ అదే కోరుకుంటారు. ఒకవేళ వారి అంచనాలు అందుకోలేకపోతే అభిమానులు విమర్శిస్తారు. అందుకే హీరో కూడా కొత్తగా ప్రయత్నించడానికి భయపడతారు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్‌తో సినిమా తీసే సామర్థ్యంలో నాకు లేదు.' అని అన్నారు. కాగా.. గతేడాది పఠాన్, జవాన్,డుంకీ చిత్రాల విజయాలతో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్స్‌ సాధించారు. మరోవైపు అనురాగ్ తెరకెక్కించిన చిత్రం 'కెన్నెడీ' 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement