బాబు పుడితే ఆయన పేరే పెడతా ! | anita hassanandani reveals name of baby if she delivers a boy | Sakshi
Sakshi News home page

బాబు పుడితే ఆయన పేరే పెడతా !

Oct 13 2020 11:34 AM | Updated on Oct 13 2020 2:19 PM

anita hassanandani reveals name of baby if she delivers a boy - Sakshi

ముంబయి: టీవీ సీరియల్స్‌లో నటించి పాపులర్‌ అయిన నటి అనిత హసనందాని తల్లి కాబోతున్న విషయాన్ని ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఐతే తనకు కొడుకు పుడితే ఏ పేరు పెడతారని ఓ ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది. మా మామ రవి పేరు పెట్టుకుంటానని తెలిపింది. ఈ ఏడాది జూలైలో తన మామ అనారోగ్యంతో మృతిచెందాడు. తన తండ్రి చినపోయినా నా ద్వారా మళ్లీ పుడతాడని భర్త రోహిత్‌ రెడ్డి అంటూ ఉంటాడని పేర్కొంది. మాతృత్వం చాలా గొప్పదని, తల్లి కాబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. 2013లో రోహిత్‌ రెడ్డితో అనితకు వివాహం జరిగింది. అనిత హిందీలో వచ్చిన నాగిని సీరియల్‌లో నటించి దేశమంతా పాపులర్‌ అయ్యింది. తెలుగుతో పాటు పలు తమిళం, కన్నడ సినిమాల్లో ఆమె నటించారు. 

(ఇదీ చదవండి: ఒక లక్ష్మి.. ఇంకొక లక్ష్మికి ప్రశంస)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement