త‌ల్లి కాబోతున్న న‌టి అనిత | Anita Hassanandani Confirms Pregnancy Shares Video | Sakshi
Sakshi News home page

త‌ల్లి కాబోతున్న న‌టి అనిత

Oct 11 2020 4:08 PM | Updated on Oct 11 2020 5:01 PM

Anita Hassanandani Confirms Pregnancy Shares Video - Sakshi

న‌టి అనిత హ‌సానందాని త‌న అభిమానుల‌కు తీపిక‌బురు వినిపించారు. త‌ల్లి కాబోతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రోహిత్ రెడ్డితో ప‌రిచయం, ప్రేమ‌, అత‌డు ప్ర‌పోజ్ చేయ‌డం, పెళ్లి చేసుకోవ‌డం, ఇప్పుడు గ‌ర్భం దాల్చ‌డం వంటి అన్ని విష‌యాల‌ను చూపిస్తూ ఈ వీడియో రూపొందించారు. నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో ప్ర‌స్తుతం వైరల్‌గా మారింది. ఈ సంద‌ర్భంగా అభిమానుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ అనిత‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. (చ‌ద‌వండి: ఆర్ఆర్ఆర్ టీం : రాజమౌళిపై ఇన్ని ఆరోపణలా! )

అనిత‌ పారిశ్రామిక‌వేత్త రోహిత్ రెడ్డిని ప్రేమించారు. 2013లో ఈ ఇద్ద‌రూ వివాహం చేసుకున్నారు. సుమారు ఏడేళ్ల త‌ర్వాత వీరు త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ చిన్న కుటుంబంలోకి విచ్చేయ‌నున్న కొత్త‌ అతిథి కోసం వీరు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ జంట‌ "నాచ్ బ‌లియే 9" సీజ‌న్‌లో పాల్గొని సంద‌డి చేసింది. అనిత విష‌యానికి వ‌స్తే తెలుగులో ఉద‌య‌కిర‌ణ్ 'నువ్వు నేను', అల్ల‌రి న‌రేష్ 'తొట్టిగ్యాంగ్‌'తో పాటు ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించారు. త‌న ప్ర‌తిభ‌ను టాలీవుడ్‌కే ప‌రిమితం చేయ‌కుండా హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టిస్తున్నారు. బుల్లితెర‌పై నాగిని సీరియ‌ల్‌లో క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. (చ‌ద‌వండి: పాలిటిక్స్‌పై విజయ్‌ సంచలన వ్యాఖ్యలు)

Advertisement
 
Advertisement
Advertisement