స్ట్రాంగ్‌ ఎవ్రీడే.. నో ఎక్స్‌క్యూజెస్‌

Anil Kapoor Fitness Secret Stronger Every Day No Excuses - Sakshi

అనిల్‌ కపూర్‌కు ఇప్పుడు 64 వయసు. ఫొటోలో కనిపిస్తున్నది ఆయన భుజబలమే. 60 దాటినా ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో అనిల్‌ కపూర్‌ ఎప్పుడూ అశ్రద్ధ చేయక చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ముంబైలో ఉన్నా ఔట్‌డోర్‌ షూటింగ్‌లో ఉన్నా వ్యాయామం తప్పనిసరి. ‘స్ట్రాంగ్‌ ఎవ్రీడే’... ‘నో ఎక్స్‌క్యూజెస్‌’ అనేది ఆయన నినాదం. అంటే ప్రతిరోజూ మనం శక్తితో ఉండాలి. వ్యాయామం చేయకుండా ఉండేందుకు సాకులు చెప్పడం మానుకోవాలి అని ఆయన ఉద్దేశ్యం. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో మొన్న ఆయన ట్విటర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఉదయ్‌పూర్‌లో షూటింగ్‌లో ఉన్నా’ అని క్యాప్షన్‌ పెట్టారు. హోటల్‌ రూమ్‌లో తన బైసెప్స్‌ను చెక్‌ చేసుకుంటూ ఉన్నారాయన ఈ ఫొటోలో.
(చదవండి: సీన్‌ తొలగించాల్సిందే)

అనిల్‌ కపూర్‌ తాజాగా ‘ఏకె వెర్సస్‌ ఏకె’ సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి రివ్యూలు పొందింది. ప్రస్తుతం ఆయన కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ‘జుగ్‌ జుగ్‌ జియో’ సినిమాలో నటిస్తున్నారు. దాని కోసమే ఉదయ్‌పూర్‌లో ఉన్నారు. ఇందులో నీతూ కపూర్, వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా చేస్తున్న ‘యానిమల్‌’లో నటించనున్నారు. బాలీవుడ్‌లో అనిల్‌ కపూర్‌ నేటికీ స్టార్‌డమ్‌ తగ్గని హీరో. ఆ స్టార్‌డమ్‌ వెనుక ఆయన ఫిట్‌నెస్‌ ఉందని వేరే చెప్పాలా? 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top