పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ | Yuganiki Okkadu Actress Andrea Jeremiah Reveals That She Is Not Marrying Permanently, Deets Inside - Sakshi
Sakshi News home page

Andrea Jeremiah On Marriage: పెళ్లి చేసుకోనంటున్న హాట్ బ్యూటీ.. కారణమేంటో తెలుసా?

Published Wed, Feb 28 2024 9:05 AM

Andrea Jeremiah Comments On Not Marrying Permanently - Sakshi

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ అనగానే చాలామందికి ప్రభాస్ గుర్తొస్తాడు. ఎందుకంటే 40 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడు. మరోవైపు హీరోయిన్లలోనూ త్రిష, ఆండ్రియా లాంటి వాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. ఆండ్రియా విషయానికొస్తే బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌. నటిగా ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. మొన్నీమధ్య వెంకటేశ్ 'సైంధవ్'లోనూ నటించింది. తాజాగా ఈమెని పెళ్లి గురించి అడగ్గా.. చేసుకోనని చెప్పింది. కారణం కూడా వెల్లడించింది. 

త్రిష వయసు 40 ఏళ్లు. లేటు అయినా సరే పెళ్లి చేసుకుంటానని ఈమె చెబుతోంది. నటి ఆండ్రియా మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. పెళ్లితో పనేంటి అని నిక్కచ్చిగా అంటోంది. 20-25 ఏళ్లప్పుడు తనకు పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ ఎందుకో కుదర్లేదని.. ఇప్పుడు తన వయుసు 40 అని, దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని  కుండబద్దలు కొట్టేసింది. 

(ఇదీ చదవండి: హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్‌గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా?)

పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటానని నటి ఆండ్రియా చెప్పుకొచ్చింది. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎదురు ప్రశ్న వేసింది. తాను ఈ జీవితానికి అలవాటు పడిపోయానని.. కాబట్టి ఇప్పట్లో, భవిష్యత్తులో పెళ్లి ఆలోచన లేదని ఆండ్రియా క్లారిటీ ఇచ్చేసింది. ఈమె నటించిన 'పిశాచి 2' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. 

ఆండ్రియా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత బహుశా వీరిద్దరూ విడిపోయి ఉంటారు. అలానే బ్రేకప్ లాంటివి ఏమైనా ఈ నటి జీవితంలో ఉన్నాయేమో? బహుశా అందుకే పెళ్లంటే విరక్తి వచ్చేసి ఇలా మాట్లాడుతుందా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)

Advertisement
Advertisement