పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Andrea Jeremiah: అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఇప్పుడు వయసు దాటిపోయింది

Published Fri, Feb 2 2024 10:09 AM

Andrea Jeremiah About Her Wedding Plans - Sakshi

గాయనిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కథానాయకిగా రాణిస్తున్న బ్యూటీ ఆండ్రియా జెర్మియా. శరత్‌కుమార్‌ హీరోగా నటించిన పచ్చైక్కిళి మత్తుచ్ఛరం చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా పరిచయం అయింది ఆండ్రియా. ఆ చిత్రం విజయవంతం కావడంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా కార్తీతో ఆయిరత్తిల్‌ ఒరువన్‌, కమల్‌ హాసన్‌ సరసన విశ్వరూపం వంటి పలు చిత్రాల్లో నటించి పాపులర్‌ అయింది. తరమణి, వడచైన్నె వంటి చిత్రాల్లో ఛాలెంజింగ్‌ పాత్రలు చేసి గట్స్‌ ఉన్న నటినని నిరూపించుకుంది.

పిశాచి 2
తుప్పరివాలన్‌ చిత్రంలో విలనిజాన్ని ప్రదర్శించి ఆల్‌రౌండర్‌ అనిపించుకుంది. నటిగా, గాయనిగా రాణిస్తున్న ఆండ్రియా చేతిలో ప్రస్తుతం పిశాచి 2, నో ఎంట్రీ, కా, మాళిగై వంటి చిత్రాలు ఉన్నాయి. పిశాచి 2 చిత్రంలో ఈమె ఒంటిమీద నూలు పోగు లేకుండా నటించిందట! అయితే ఆ సన్నివేశాన్ని తరువాత తొలగించినట్లు సమాచారం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయినా, ఈ చిత్రం ఇంకా తెరపైకి రాలేదు. కాగా ఈ బ్యూటీ ఇప్పటికీ సింగిలే అన్నది తెలిసిందే.

అప్పుడనుకున్నా కానీ..
ఇదే విషయం ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానల్‌ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. విలేకరి పెళ్లి గురించి ప్రశ్నించగా ఆండ్రియా ఇలా బదులిచ్చింది.. ఒక వయసు వచ్చే సరికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ప్రతి అమ్మాయికీ వస్తుందని తెలిపింది. అలాంటి ఆలోచన తనకూ 30 ఏళ్ల వయసులో వచ్చిందని చెప్పింది. అయితే ఇప్పుడు ఆ వయసు దాటిపోయిందని పేర్కొంది. అయినా ఇలా ఉండటం వల్ల తనకెలాంటి బాధ లేదంది. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదని స్పష్టం చేసింది.

చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ

Advertisement
 
Advertisement
 
Advertisement