క్రేజీ రీమేక్‌కి సై

Andhadhun Telugu Remake star in november - Sakshi

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హిందీలో ఘన విజయం సాధించిన క్రేజీ చిత్రం ‘అంధాధూన్‌’కి ఇది తెలుగు రీమేక్‌. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌ . సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ‘అంధాధూన్‌’లో టబు చేసిన నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రను తెలుగులో తమన్నా, రాధికా ఆప్టే పాత్రను నభా నటేష్‌ చేయనున్నారు. ‘అంధాధూ¯Œ ’లో టబు నటనకు ప్రశంసలు దక్కాయి. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న ఆ పాత్రను చేసే సవాలును స్వీకరించారు తమన్నా. ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో నటించే అవకాశం లభించినందుకు నభా నటేష్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: హరి కె. వేదాంత్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top