Anchor Lasya: యాంకర్‌ లాస్య నోట ర్యాప్‌ సాంగ్‌, అట్లుంటది ఆమెతోని!

Anchor Lasya Manjunath Sings Savage Mom Rap Song, Watch Video - Sakshi

యాంకర్‌ లాస్య.. బుల్లితెర ప్రేక్షకులకు తెలియని పేరు కాదు. టీవీ షోలలో యాంకర్‌గా అలరించిన ఆమె బిగ్‌బాస్‌ తెలుగు నాల్గో సీజన్‌లోనూ పాల్గొని జనాలను ఎంటర్‌టైన్‌ చేసింది. లాస్య టాక్స్‌ ద్వార యూట్యూబ్‌లోనూ వినోదాన్ని పంచుతున్న ఆమె తాజాగా ర్యాప్‌ సాంగ్‌ పాడింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది. ప్రపంచమంతా తల్లుల దినోత్సవం జరుపుకుంటే వీళ్లేమో నాకు తలనొప్పిలా తయారయ్యారు.. అన్న డైలాగ్స్‌తో మొదలు పెట్టిన లాస్య చివరికి ర్యాప్‌ సాంగ్‌ పాడి అందరినీ ఓ ఊపు ఊపేసింది.

'ఏజ్‌ బార్‌ అనుకోవద్దు న్యూ ఏజ్‌ మామ్‌ నేను.. ర్యాప్‌తోని ఇరగదీస్తా సావేజ్‌ మామ్‌ నేను.. బాసాన్లు తోమమంటే సాకులన్ని చెప్తవు.. బుక్కు ముందు పెట్టుకుని గురక పెట్టి పంటవు.. అంటూ పాటతో అదరగొట్టింది లాస్య. ఇక ఇంగ్లీష్‌ ఆల్ఫబెట్స్‌లోని  A టు Z వరకు అన్ని లెటర్స్‌తో లైన్స్‌ రాసి మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారు రోల్‌ రైడా, మనోజ్‌ జూలూరి. మొత్తానికి ఈ సాంగ్‌ మాత్రం అద్భుతంగా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. ఇక ఈ పాటను తల్లీబిడ్డలందరికీ అంకితం ఇస్తున్నట్లు తెలిపింది లాస్య.

చదవండి: ఆ డైరెక్టర్స్‌ మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకుంటారు..

ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్‌, సోషల్‌ మీడియాలో లేఖ వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top