వైరలవుతోన్న అనసూయ-విజయ్‌ సేతుపతి ఫోటో

Anasuya Bharadwaj and Vijay Sethupathi Photos Viral - Sakshi

టాలీవుడ్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. యాంకర్‌గా కొనసాగుతూనే.. సినిమాల్లో కూడా నటిస్తున్నారు అనసూయ. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. తమిళ హీరో విజయ్‌ సేతుపతితో కలిసి నవ్వులు చిందిస్తోన్న ఫోటోని షేర్‌ చేశారు అనసూయ. ‘బాండింగ్‌ విత్‌ బ్రిలియన్స్‌..  నిజంగానే మక్కల్‌ సెల్వన్’‌ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా చిత్రం రాబోతుందా.. అసలు వీరిద్దరు ఎక్కడ కలిశారు.. ఏ చిత్రం కోసం అంటూ అభిమానులు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. (చదవండి: ‘ఆచార్య’లో అనసూయ.. చరణ్‌తో?)

అయితే దీని గురించి మాత్రం ఎలాంటి వివరణ లేదు. ఒకవేళ విజయ్‌సేతపతి చిత్రంలో అనసూయ నటిస్తే.. అభిమానులకు పండగే. ఇక సినిమాల విషయాని​కి వస్తే ప్రస్తుతం అనసూయ ‘థాంక్యూ బ్రదర్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కాక కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తండ’ చిత్రంలో నటిస్తున్నారు. అలానే ‘పుష్ప’, ‘ఆచార్య’ చిత్రాల్లో కూడా అనసూయ చాన్స్‌ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top