Kalki 2898 AD: కల్కిలో ఇలా.. | Amitabh Bachchan Birthday Special Kalki 2898 AD Poster Released | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: కల్కిలో ఇలా..

Oct 12 2023 12:44 AM | Updated on Oct 13 2023 7:17 PM

Amitabh Bachchan Birthday Special Kalki 2898 AD Poster Released - Sakshi

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ అభిమానులకు బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చింది ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌. బుధవారం (అక్టోబర్‌ 11) అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి..’లో ఆయన గెటప్‌ ఇలా ఉంటుందంటూ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘‘కొన్ని తరాలకు స్ఫూర్తిగా నిలిచిన లెజెండ్‌తో సినిమా చేయడం ఓ ఆశీర్వాదం. ఒక పెద్ద కల నెరవేరినట్లు అనిపిస్తోంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు సార్‌’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రభాస్‌ స్పందించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సి. అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. ‘‘మైథాలజీ స్ఫూర్తితో సైన్స్‌ ఫిక్షన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement