Amitabh Bachchan, Deepika Padukone Reunite For The Intern Movie - Sakshi
Sakshi News home page

6 ఏళ్ల తర్వాత అమితాబ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న దీపికా

Apr 6 2021 7:59 AM | Updated on Apr 6 2021 9:08 AM

Amitabh Bachchan And Deepika Padukone Shares Screen Once Again - Sakshi

దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు.

దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. హాలీవుడ్‌ హిట్‌ అమెరికన్‌ ఫిల్మ్‌ ‘ది ఇంటర్న్‌’ సినిమా హిందీలో రీమేక్‌ కానుంది. ‘బదాయి హో’ ఫేమ్‌ అమిత్‌ శర్మ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ చిత్రంలోనే అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ కలిసి నటించనున్నారు. 2015లో వచ్చిన హిందీ చిత్రం ‘పికు’ తర్వాత అమితాబ్, దీపికా కలిసి చేస్తున్న చిత్రం ఇదే.

‘‘నా మోస్ట్‌ స్పెషలిస్ట్‌ కో స్టార్‌ అమితాబ్‌గారితో మరోసారి వర్క్‌ చేయనున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు దీపికా. ‘వన్‌ మోర్‌ టైమ్‌’ అని ట్వీట్‌ చేశారు అమితాబ్‌. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కూడా అమితాబ్, దీపిక లీడ్‌ రోల్స్‌ చేయనున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement