సూపర్‌ హీరో | Allu Arjun set to collaborate with Basil Joseph for 25th film | Sakshi
Sakshi News home page

సూపర్‌ హీరో

Mar 31 2026 3:12 AM | Updated on Mar 31 2026 3:12 AM

Allu Arjun set to collaborate with Basil Joseph for 25th film

అల్లు అర్జున్  హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ . ఈ చిత్రం తర్వాత మరో తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించనున్న సినిమాలో నటిస్తారాయన. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే మలయాళ దర్శకుడు, నటుడు బాసిల్‌ జోసెఫ్‌ డైరెక్ట్‌ చేయనున్న సినిమాలో అల్లు అర్జున్  నటిస్తారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఇటీవల జరిగిన అల్లు అర్జున్  సోదరుడు అల్లు శిరీష్‌ వివాహంలో బాసిల్‌ జోసెఫ్‌ కనిపించారు. దీంతో అల్లు అర్జున్ –బాసిల్‌ జోసెఫ్‌ కాంబినేషన్ లో మూవీ ఉంటుందన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లు అయింది. బాసిల్‌తో అల్లు అర్జున్  చేయబోయేది ఓ సూపర్‌ హీరో మూవీ అని, అల్లు అర్జున్  కెరీర్‌లో ఇది 25వ సినిమాగా ఉంటుందని టాక్‌. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్  బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement