Allu Arjun Fans Protest At Geetha Arts Office For Pushpa 2 Movie Updates - Sakshi
Sakshi News home page

Allu Arjun Fans Protest: పుష్ప-2 మేకర్స్‌పై బన్నీ ఫ్యాన్స్‌ ఫైర్.. గీతా ఆర్ట్స్‌ వద్ద టెన్షన్

Nov 13 2022 5:55 PM | Updated on Nov 13 2022 6:44 PM

Allu Arjun Fans Protest At Geetha Arts Office For Pushpa 2 Movie Updates - Sakshi

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు బన్నీ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  పుష్ప- 2 మూవీ అప్ డేట్స్‌ త్వరగా ఇవ్వాలంటూ అభిమానులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే పుష్ప రిలీజ్ అయి డిసెంబర్‌ 17 నాటికి ఏడాది పూర్తి కావొస్తోంది.  సంవత్సరం గడుస్తున్నా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద బైఠాయించారు. దీనిపై ఇంకా లేట్ చేస్తే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటూ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. 

ఐకాన్ స్టార్ బన్నీ, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలోని అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. ఆ డైలాగ్‌కు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్ సైతం పుష్ప గెటప్‌లో కనిపించి అదుర్స్‌ అనిపించారు. పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది. 

Advertisement
 
Advertisement
Advertisement