Allu Aravind: హిందీలో సరదాగా రిలీజ్‌ చేద్దామనుకుంటే ఇప్పుడేమో..

Allu Aravind Speech In Karthikeya 2 Success Meet - Sakshi

Allu Aravind Speech In Karthikeya 2 Success Meet: క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా నటించిన చిత్రం "కార్తికేయ‌ 2". ఈ సినిమాకు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వహించారు. మంచి విజయం సాధించిన 'కార్తికేయక'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న థియేటర్స్‌లలో  విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా  నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ  నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత  నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు. 

ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్‌లలో  విడుదల చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్‌లలో ఆడుతుంది. అంటే ఇవాళ భాష అనే బారికేడ్లను దాటుకొని ప్రజల గుండెల్లోకి వెళ్లింది అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా. ఇలా అన్ని థియేటర్స్‌లలో ఆడదు  కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి'' అని తెలిపారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్, అనుపమ, టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అని చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు. 

చదవండి: ప్రభాస్‌ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా?
మహేశ్‌ బాబు థియేటర్‌లో దళపతి విజయ్.. వీడియో వైరల్‌

''ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసినందుకు ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు'' అని హీరో నిఖిల్‌ తెలిపాడు. ''సినిమా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అందరూ కొత్త యాక్టర్స్ లా చాలా బాగా నటించారు. వీరందరికీ ఇది 2.0 అనుకోవచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను'' అని దర్శకుడు  శ్రీ వాస్ పేర్కొన్నాడు. ''మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది. నాకింత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్‌ చందు మొండేటి తెలిపాడు. 

చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ
సిల్క్‌ స్మిత బయోపిక్‌కు రానున్న సీక్వెల్‌.. ఈసారి ఏ హీరోయిన్‌?
బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top