‘ఇది చాలా చిన్న విషయం, మరీ ప్రజలు అంగీకరిస్తారో లేదో’

Alaya F Reveals She Considered Cosmetic Surgery For Her Nose - Sakshi

తన లోపం చాలా చిన్నదని, దాన్ని ప్రజలు అంగీకరిస్తారో లేదో తను తెలియదు కానీ  సర్జరీకి మాత్రం వెళ్లనంటోంది బాలీవుడ్‌ భామ అలయ. బాలీవుడ్‌ సీనియర్‌ నటి పూజ బేడీ గారాల పట్టి అయిన అలయ జవాని జానేమన్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అయితే సినీ తారలంతా తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు ప్రత్యేక సర్జరీలు చేసుకుంటారనే విషయం తెలిసిందే.

పాత తరం నుంచి నేటి తరం హీరోయిన్లు సైతం  ​కాస్మోటిక్‌ సర్జరీలు చేయించుకుని తమ అందానికి మెరుగులందుకుంటున్నారు. అయితే నేటి తరం హీరోయిన్‌ అలయ మాత్రం తాను సర్జరీలు చేయించుకోనని తెల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ముక్కకు కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకోవాలనుకున్నట్లు వెల్లడించింది. ‘అవును నేను నా ముక్కుకు కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకోవాలనుకున్నాను. ఎందుకంటే నా ముక్కు ఒకవైపు ఎత్తుగా ఉంటుంది. మరోవైపు బాగుంటుంది. అయితే ఇది చాలా చిన్న విషయమనిపించింది.

అందుకే సర్జరీ చేయించుకోవాలన్న ఆలోచన మానుకున్నాను. ప్రజలు ఇలా చూస్తారో లేదో నాకు తెలియదు.కానీ నేను మాత్రం సర్జరీ చేయించుకోను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం చాలా మంది హీరోయిన్‌లు కాస్మెటీకి సర్జరీకి వెళ్లి అందాన్ని మరింత పెంచుకుంటున్నప్పటికి తాను మాత్రం చేయనని చెప్పింది. కాగా నటుడు ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలా, పూజా బేడి కుమార్తె అయిన అలయ 2020 లో జవానీ జనేమాన్ చిత్రం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. అలయ తదుపరి ఏక్ జౌర్ గజాబ్ కహానీలో నటిస్తోంది.

చదవండి: 
షాకింగ్‌: నటికి సర్జరీ మిస్‌ఫైర్‌ కావడంతో

ఫ్యాట్‌‌ సర్జరీ.. సగం రక్తం కోల్పోయా: నటి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top