షాకింగ్‌: నటికి సర్జరీ మిస్‌ఫైర్‌ కావడంతో

Chinese Star Shares Shocking Pics Of Nose Surgery Goes Misfire - Sakshi

బీజింగ్‌: అందాన్ని పెంచుకోవాలని కాస్మొటిక్‌ సర్జరీలను ఆశ్రయిస్తారు చాలా మంది సెలబ్రిటీలు. ముఖ్యంగా గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్న వారు లైమ్‌లైట్‌లో ఉండాలంటే ఎప్పటికప్పుడు సౌందర్యానికి మెరుగులు దిద్దుకుంటూ ఉండక తప్పని పరిస్థితి. అయితే అంతా సవ్యంగా జరిగితే పర్లేదు కానీ, ఏమాత్రం తేడా వచ్చినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. చైనా నటి, సింగర్‌ గావో లియూ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ముక్కుకు సర్జరీ చేయించుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. లియూ అక్టోబరులో తన ఫ్రెండ్‌ సలహా మేరకు గువాంగ్జూలో గల ఓ ప్లాస్టిక్‌ సర్జన్‌ను కలిసింది. ముక్కును ట్రిమ్‌ చేయించుకోవాలనుకుంటున్నానని చెప్పగా.. అందుకు సర్జన్‌ అంగీకరించడంతో సదరు ఆస్పత్రిలో చేరింది.(చదవండి: షాకింగ్‌: పసుపు రంగులోకి మారిన శరీరం!)

అయితే, సర్జరీ తర్వాత ఆమె ముక్కు చివర చర్మం పూర్తిగా నల్లగా మారిపోయింది. కణజాలం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో లియూ చేతిలో ఉన్న అవకాశాలు కూడా చేజారిపోయాయి. మరో ఏడాది పాటు ఆమె స్క్నీన్‌పై కనిపించే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన లియూ.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయాలని, లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని నెటిజన్లకు సూచించింది. ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటాననే ఆశాభావం వ్యక్తం చేసింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top