
ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ లొకేషన్‌ను ఊటీ నుంచి శ్రీలంకకు మార్చారట చిత్రబృందం...
కొన్ని రోజులు శ్రీలంకకు మకాం మార్చనున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా 'రామ్‌సేతు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుష్రత్ భారుష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు అక్షయ్. కాగా ఈ సినిమాలోని అండర్ వాటర్ సన్నివేశాలతో పాటు ఇతర కీలక సన్నివేశాలను ఊటీలో చిత్రీకరించాలనుకున్నారు.
కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ లొకేషన్‌ను ఊటీ నుంచి శ్రీలంకకు మార్చారట చిత్రబృందం. శ్రీలంకలో చిత్రీకరణకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారట అభిషేక్. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైంది. అయితే అక్షయ్ కుమార్‌కు కోవిడ్ పాజిటివ్ రావడంతో చిత్రీకరణకు బ్రేక్ పడింది. ప్రస్తుతం అక్షయ్ కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు.