రంజాన్‌కు పెద్దోడు.. చిన్నోడు...  | Sakshi
Sakshi News home page

రంజాన్‌కు పెద్దోడు.. చిన్నోడు... 

Published Sun, Jan 21 2024 3:37 AM

Akshay Kumar and Tiger Shroff announces teaser release date of their upcoming movie Bade Miya Chote Miya - Sakshi

రంజాన్‌కు థియేటర్స్‌కు వస్తున్నారు ‘బడే మియా చోటే మియా’ (పెద్దోడు.. చిన్నోడు). అక్షయ్‌కుమార్, టైగర్‌ ష్రాఫ్‌  హీరోలుగా నటిస్తున్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘బడే మియా చోటే మియా’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్, సోనాక్షీ సిన్హా, మానుషీ చిల్లర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీలో ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి హిట్‌ సినిమాలను తీసిన దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

స్కాట్లాండ్, యూఎస్, ఇండియా, లండన్‌ వంటి లొకేషన్స్‌లో కొంత భాగం చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు, ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ప్రపంచం అంతం అవుతుందన్నప్పుడు మా హీరోలు మాత్రం రైజ్‌ అవుతుంటారు’ అనే క్యాప్షన్‌ని ఈ పోస్టర్‌కు జత చేశారు.

Advertisement
 
Advertisement