'ఆడేమన్నా కుర్రాడు అనుకుంటున్నాడా.. కొంచెం తగ్గమను' | Sakshi
Sakshi News home page

Naa Saami Ranga Teaser: ఒక్క క్షణం కోసం రోజంతా ఎదురుచూడాలా?.. ఆసక్తిగా టీజర్!

Published Sun, Dec 17 2023 3:07 PM

Akkineni Nagarjuna Naa Saami Ranga Teaser Out Today - Sakshi

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘నా సామి రంగ. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున ఫుల్‌ మాస్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: నా సామిరంగ.. నిన్ను ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా!)

'ఏం సేత్తున్నాడేంటి మీవోడు' అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత మామిడితోటలో మావాడు 20 మందిని ఊతకొట్టుడు కొట్టేశాడంటూ అల్లరి నరేశ్‌ చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది. టీజర్‌లో నాగార్జున ఫుల్ మాస్ ఫైట్‌ను చూపించారు. 'ఆడేమన్నా కుర్రాడు అనుకుంటున్నాడా? కొంచెం తగ్గమను' అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత నాగార్జున, ఆషిక రంగనాథ్ మధ్య సీన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్‌ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement