నా సామిరంగ.. నిన్ను ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా! | Sakshi
Sakshi News home page

Naa Saami Ranga: నా సామిరంగ.. ఎత్తుకెళ్లిపోతానంటున్న నాగార్జున!

Published Sun, Dec 10 2023 5:03 PM

Nagarjuna Akkineni Latest Movie Naa Saami Ranga Lyrical Song Release - Sakshi

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘నా సామి రంగ. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున ఫుల్‌ మాస్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 

'బెల్లం చెరకు చూపులదానా.. అల్లం మిరప మాటలదానా..బొండు మల్లి నడుముదానా.. బండెడు సోకుల ఓ నెరజాణ.. నువ్వుట్టా పోతుంటే..నిన్నట్టా సూతుంటే..  ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే' అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్ అందించారు.  కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి హీరోయిన్‌ ఆషిక రంగనాథ్ పాత్రను అభిమానులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె వరలక్ష‍్మి పాత్రలో కనిపించనుందని వెల్లడించారు. ప్రత్యేకంగా గ్లింప్ల్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. 

 
Advertisement
 
Advertisement