
హీరో అక్కినేని నాగార్జున మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి ఒకే చెప్పారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తగా నిర్మించనున్నాయి. సోమవారం ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.(వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్)
మరోవైపు ఈ చిత్రానికి నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. అయితే కరోనా లాక్‌డౌన్ అనంతరం.. ఒకటి రెండు సినిమాలు మినహా పెద్ద చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లు ఇంకా మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడూ మొదలవుతుందనేది వేచిచూడాలి. (బిగ్‌బాస్ ఎంట్రీపై శ్రద్ధా దాస్ క్లారిటీ)
కాగా, నాగార్జున ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రానికి ప్రవీణ్ పక్కా పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడి చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక, నాగార్జున ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది.