బిగ్‌బాస్ ఎంట్రీపై శ్రద్ధా దాస్ క్లారిటీ

బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్‌ల విషయంలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో పలువురు సెలబ్రిటీలు వాటిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. తాజాగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో ఆమె స్పందించారు. బిగ్‌బాస్ కోసం తనను ఎవరు సంప్రదించలేదని.. తాను అందులో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.(సీనియర్ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత)
ఈ మేరకు శ్రద్ధా ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్నారా? అని చాలా మెసేజ్‌లు వస్తున్నట్టు తెలిపారు. కానీ అందులో నిజం లేదని చెప్పారు. వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు. అలాంటి వార్తల రాసేవారికి ఇదే తన మొదటి, చివరి హెచ్చరిక అని చెప్పారు. ఇకపై ఇటువంటి వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గత సీజన్‌లో కూడా శ్రద్దా దాస్ బిగ్‌బాస్ హౌస్‌లోని అడుగుపెట్టానున్నారనే ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. (ఎల్లుండి కేజీఎఫ్ 2 నుంచి సర్‌ప్రైజ్)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి