సీనియర్‌ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత | Producer Kandepi Satyanarayana Deceased | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత

Jul 27 2020 4:00 PM | Updated on Jul 27 2020 4:00 PM

Producer Kandepi Satyanarayana Deceased - Sakshi

సత్యనారాయణ మృతి పట్ల పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

బెంగళూరు : సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.(మరోసారి నా హృదయం ముక్కలైంది: కృతి సనన్‌)

సత్యనారాయణ మృతి పట్ల పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, ‘పాండురంగ మహాత్మ్యం’ అనే డబ్బింగ్ సినిమా ఆయన తొలి చిత్రం. అనంతరం కొంగుముడి, దొరగారింట్లో దొంగోడు, శ్రీవారు వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కూడా ఆయన పలు చిత్రాలను నిర్మించారు.   మొత్తంగా 40 చిత్రాల‌కు పైగా ఆయ‌న నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.(ఎల్లుండి కేజీఎఫ్ 2 నుంచి స‌ర్‌ప్రైజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement