breaking news
K Satyanarayana
-
సీనియర్ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత
బెంగళూరు : సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.(మరోసారి నా హృదయం ముక్కలైంది: కృతి సనన్) సత్యనారాయణ మృతి పట్ల పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, ‘పాండురంగ మహాత్మ్యం’ అనే డబ్బింగ్ సినిమా ఆయన తొలి చిత్రం. అనంతరం కొంగుముడి, దొరగారింట్లో దొంగోడు, శ్రీవారు వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కూడా ఆయన పలు చిత్రాలను నిర్మించారు. మొత్తంగా 40 చిత్రాలకు పైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.(ఎల్లుండి కేజీఎఫ్ 2 నుంచి సర్ప్రైజ్) -
చివరకు.. వాళ్లు కరివేపాకు
టీడీపీ రెబెల్స్‌గా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కొట్టు సత్యనారాయణ, టీవీ రామారావులను ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ, కొవ్వూరులో టీవీ రామారావు, పాలకొల్లులో త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి)లకు టీడీపీ అధినేత చంద్రబాబు మ్యాండెట్ ఆశ చూపించి.. చివరకు కరివేపాకులా తీసిపారేశారు. దీంతో వీరంతా రెబెల్ అభ్యర్థులుగా పోటీకి దిగారు. టీడీపీ అంతు చూస్తామని, ఆ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో కొట్టు సత్యనారాయణ, టీవీ రామారావుపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. అరుుతే, పాలకొల్లు రెబెల్ అభ్యర్థి త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి)పై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ విషయూన్ని ముందే పసిగట్టిన ఆయన శుక్రవారం రాత్రే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బాబ్జితో టీడీపీ వర్గాలు తెరవెనుక మంత్రాగం నడుపున్నాయని.. ఆ కారణంగానే ఆయనపై సస్పెన్షన్ వేటు పడలేదనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీలో ఉన్నారో తెలియని కనుమూరి రఘురామకృష్ణంరాజు టీడీపీ తరఫున నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న విషయం విదితమే. దీంతో ఆయనను టీడీపీకి చెందిన వ్యక్తిగా భావించి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా బీజేపీ నేతలు చంద్రబాబును కోరారు. కానీ రఘురామరాజుపైనా ఎలాంటి చర్యలు లేవు. నట్టేట మునిగారు తనవారైనా.. పరాయి వారైనా టీడీపీని నమ్మితే వెన్నుపోటు పొడిచే సంస్కృతిని చంద్రబాబుకు అలవాటైపోరుుంది. తన స్వార్థం కోసం చివరి నిమిషం వరకూ వాడుకుని ఎంగిలి విస్తరాకులా విసిరేయడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య. ఇది తెలిసి కూడా ఆయనను గుడ్డిగా నమ్మి వెళ్లిన వారికి తేరుకోలేని ఎదురుదెబ్బలు తగలడం పరిపాటిగా మారింది. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. ఆఖరి క్షణం వరకూ మీదే మ్యాండెట్ అని నమ్మించి చివరికి తూచ్ అనడంతో అవమాన భారం భరించలేని టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గంపెడాశతో టీడీపీలోకి వెళ్లిన కొట్టు సత్యనారాయణకు, బాబునే నమ్ముకుని ఉన్న టీవీ రామారావుకు చంద్రబాబు వల్ల చివరకు మొండిచెయ్యే మిగిలింది.