వలిమై మాదిరే అజిత్‌ 61లోనూ హై ఓల్టేజ్‌ యాక్షన్‌   | Sakshi
Sakshi News home page

Ajith: వలిమై మాదిరే అజిత్‌ 61లోనూ హై ఓల్టేజ్‌ యాక్షన్‌

Published Fri, Jul 22 2022 10:53 AM

AK61: High Voltage Action Scenes In Ajith 61 Movie - Sakshi

నటుడు అజిత్‌ రూటే సపరేటు. ఆయనకు దర్శక-నిర్మాతలతో మంచి ర్యాప్‌ కుదిరితే వారితోనే వరుసగా చిత్రాలు చేస్తారు. ఇది అరుదైన విషయమే అవుతుంది. బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ అజిత్‌ కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై, తాజాగా నిర్మిస్తున్న చిత్రం వరుసగా నిర్మించడం విశేషం అయితే ఈ మూడు చిత్రాలకు దర్శకుడు హెచ్‌.వినోద్‌ కావడం మరో విశేషం. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూడవ చిత్రం షూటింగ్‌ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే అజిత్‌ ప్రస్తుతం యూరప్‌లో ఫ్యామిలీ టూర్‌ చేస్తున్నారు. దీంతో ఆయన లేని సన్నివేశాలను దర్శకుడు హెచ్‌. వినోద్‌ చిత్రీకరిస్తున్నారు.

అజిత్‌ ఈనెలా ఖరుకు టూర్‌ ముగించుకుని చెన్నై తిరిగి వచ్చి షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఇకపోతే వలిమై చిత్రంలో బైక్‌ చేజింగ్‌ సన్నివేశాలు అజిత్‌ అభిమానులను అబ్బురపరిచాయి. హాలీవుడ్‌ చిత్రాల తరహాలో ఉన్నాయంటూ సినీ వర్గాలు ప్రశంసించారు. అదే విధంగా తాజా చిత్రంలోనూ హై ఓల్టేజ్‌ యాక్షన్‌తో పాటు బైక్‌ చేజింగ్‌ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫైటింగ్‌ సన్నివేశాల వీడియో లీక్‌ అయి చిత్ర యూనిట్‌ను షాక్‌కు గురి చేసింది. కాగా ఇందులో నటి మంజువారియర్, సముద్రఖని, జాన్‌ కొకెయిన్, వీరా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement