రజనీకి అజిత్‌ ఫోన్‌ | Ajith Phone Call to Rajinikanth Wishing 45 Years Complete in Film Industry | Sakshi
Sakshi News home page

రజనీకి అజిత్‌ ఫోన్‌

Aug 15 2020 6:05 AM | Updated on Aug 15 2020 6:05 AM

Ajith Phone Call to Rajinikanth Wishing 45 Years Complete in Film Industry - Sakshi

సినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు నటుడు అజిత్‌ ఫోన్‌ చేశారు. ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న తాజా న్యూస్‌. రజనీకాంత్‌కు అజిత్‌ ఎందుకు చేశారు అన్న విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు రజనీ నటుడిగా 45 ఏళ్ల మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజిత్‌ రజనీకాంత్‌కు ఫోన్‌ చేసి నటుడిగా 45 ఏళ్ల మైలు రాయిని టచ్‌ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రజనీకాంత్, అజిత్‌ అరగంటకుపైగా ముచ్చటించుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement