డైరెక్టర్‌తో వివాదం.. పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ | Actress Aishwarya Rajesh Counter Tweet On Director Veera Pandian Shocking Comments On Her, Deets Inside - Sakshi
Sakshi News home page

హీరోయిన్-డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది?

Published Wed, Jan 31 2024 9:02 AM

Aishwarya Rajesh Tweet On Director Veera Pandian Comments - Sakshi

హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌కి ఓ దర్శకుడి మధ్య మాటల యుద్ధం. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆయనేమో తను ఆమె దగ్గర సినిమా కోసం వెళ్తే చేయనని చెబుతోందని అంటున్నారు. ఐశ్వర్య ఏమో పూర్తిగా తెలుసుకుని మాట్లాడండని కౌంటర్స్ వేస్తోంది. దీంతో అసలేం జరిగిందిరా బాబు సినీ ప్రేమికులు తల గోక్కుంటున్నారు. ఇంతకీ అసలేంటి వివాదం? ఏం జరుగుతోంది?

తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్.. తమిళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి తర్వాత తర్వాత హీరోయిన్ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అ‍డ్రస్‌గా మారిపోయింది. తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించినా సరే ఈమెకు పెద్దగా కలిసిరాలేదు. దీంతో పూర్తిగా తమిళం వరకు పరిమితమైపోయింది. అలాంటి ఈమెపై దర్శకుడు వీరపాండియన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో)

2011లో దర్శకుడు వీర పాండియన్.. 'అవర్‌గళుమ్‌ ఇవర్‌గళుమ్‌' అని ఓ సినిమా తీశాడు. ఇందులో ఐశ్వర్య రాజేశ్ ఓ హీరోయిన్. తాజాగా ఓ మీడియా ప్రకటన విడుదల చేసిన ఈ డైరెక్టర్.. 'ఐశ్వర్య రాజేశ్‌ని నేను ఇండస్ట్రీకి పరిచయం చేశా. ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన తర్వాత నా సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించట్లేదు. ఆమె ఆర్థికంగా కష్టపడుతున్న సమయంలో ఆటో ఖర్చులకు కూడా నేనే డబ్బులు ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు.

దీనిపై పరోక్షంగా స్పందించిన ఐశ్వర్య రాజేశ్.. దర్శకుడు వీరపాండియన్ పేరు చెప్పకుండా ట్వీట్ చేసింది. 'చాలా మంది ఓ అంశాన్ని మాత్రమే విని మాట్లాడుతున్నారు. అసలు విషయాలు తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే.. పూర్తిగా తెలుసుకుని ఆరోపణలు చేస్తే బాగుంటుంది' అని రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?)

Advertisement
 
Advertisement
 
Advertisement