AHA Upcoming Movies And Series Releases In 2023 Jan 1st Week - Sakshi
Sakshi News home page

AHA: ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ అంటున్న ఆహా, ఈ వారం ఏమేం రిలీజవుతున్నాయంటే?

Jan 2 2023 7:06 PM | Updated on Jan 2 2023 7:55 PM

AHA Upcoming Releases In 2023 - Sakshi

2023 జనవరి మొదటివారం ఆహాలో విడుదల కాబోతున్న చిత్రాలు, సిరీస్‌లేంటో చూసేద్దాం..

2022.. బోలెడన్ని హిట్స్‌తో పాటు ఎన్నో ఫ్లాపులను కూడా మిగిల్చింది. అయితే బాక్సాఫీస్‌ దగ్గర విజయం సాధించలేకపోయిన సినిమాలు ఓటీటీలో మాత్రం సూపర్‌ హిట్‌ అనిపించుకున్నాయి. అటు ఓటీటీ సంస్థలు కూడా సినిమాలు, వెబ్‌ సిరీస్‌, షోలతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా సరికొత్త వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. మరి 2023 జనవరి మొదటివారం ఆహాలో విడుదల కాబోతున్న చిత్రాలు, సిరీస్‌లేంటో చూసేద్దాం..

అన్‌స్టాపబుల్‌ 2 విత్‌ ఎన్‌బీకే: బాహుబలి 2 ఎపిసోడ్‌
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఇరగదీస్తున్న షో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. టాలీవుడ్‌ సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు బాలయ్య. ఇటీవలే ఈ షోకి ప్రభాస్‌, గోపీచంద్‌ రాగా ఇందుకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ ప్రస్తుతం ఆహాల్‌ స్ట్రీమ్‌ అవుతోంది. రెండో ఎపిసోడ్‌ చూడాలంటే మాత్రం ఈ శుక్రవారం దాకా ఆగాల్సిందే!

కామెడీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌- ఎపిసోడ్‌ 5
ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న షో కామెడీ ఎక్స్‌చేంజ్‌. సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఎక్స్‌ప్రెస్‌ హరి, ముక్కు అవినాష్‌, వేణు, సద్దాం, బుల్లెట్‌ భాస్కర్‌, జ్ఞానేశ్వర్‌ ఇలా పలువురు కమెడియన్లు పాల్గొంటున్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఈ షో ఐదవ ఎపిసోడ్‌ శుక్రవారం రిలీజ్‌ కానుంది.

స్కూల్‌ 2017 (కొరియన్‌ షో)
కొరియన్‌ సిరీస్‌ ఇష్టపడేవారి కోసం మరో కొత్త సిరీస్‌ను అందుబాటులోకి తెస్తోంది ఆహా. ఈ సిరీస్‌ శనివారం ప్రసారం కానుంది.

చదవండి: సంపూర్ణేశ్‌కు రూ.25 లక్షలు ఫైన్‌, తారక్‌ ఏం చేశారంటే?
ఏమున్నాడ్రా బాబూ.. హృతిక్‌ రోషన్‌ ఎయిట్‌ ప్యాక్‌ లుక్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement