Hrithik Roshan: ఎయిట్‌ ప్యాక్‌ బాడీతో దర్శనమిచ్చిన హృతిక్‌, ఫోటోలు వైరల్‌

Hrithik Roshan Eight Pack Look Goes Viral - Sakshi

హైటూ, వెయిటూ, లుక్స్‌.. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండే హీరో హృతిక్‌ రోషన్‌. అమ్మాయిల గుండెల్లో నిద్రపోయే ఈ అందగాడు తాజాగా ఓ ఫోటో షేర్‌ చేసి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. కొత్త సంవత్సరంలోకి మరింత ఫిట్‌గా అడుగు పెడుతూ ఎయిట్‌ ప్యాక్‌తో దర్శనమిచ్చాడు. ఆల్‌రైట్‌.. ఇక ముందుకు వెళ్దాం అంటూ #2023 హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

48 ఏళ్ల వయసులో ఎయిట్‌ ప్యాక్‌ బాడీతో కనిపించడమేంటని షాకవుతున్నారు ఫ్యాన్స్‌. చిన్నప్పటి నుంచి చూస్తున్నా సేమ్‌ బాడీ.. ఏం మారలేదు. దమ్ముంటే మాలా పొట్ట పెంచు అంటూ వెరైటీగా సవాల్‌ విసురుతున్నారు. అమ్మాయిలైతే.. ఏమున్నాడ్రా బాబూ అంటూ ఫోటోలు సేవ్‌ చేసుకుంటున్నారు. ఇప్పటినుంచి మేము కూడా డైట్‌ పాటిస్తామని కొందరంటుంటే అయినా మీ డెడికేషన్‌ మాకు సాధ్యం కాదులేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: నటి ఆత్మహత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌
నెల రోజులకే దుకాణం బంద్‌ చేసిన కిరాక్‌ ఆర్పీ

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top