‘మహా సముద్రం’ నుంచి ‘మహా’ లుక్‌ వచ్చేసింది

Aditi Rao Hydari First Look Poster Released From Maha Samudram Movie - Sakshi

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’.యాక్షన్‌ లవ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 'లైట్ హౌస్ ఆఫ్ మహాసముద్రం' అంటూ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ లుక్ బయటపెట్టింది చిత్ర యూనిట్‌. తాజాగా  మరో హీరోయిన్‌ అదితిరావు హైదరి పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో ఆమె ‘మహా’అనే క్యారెక్టర్‌లో కనిపించనుంది.

ఈ సినిమా కథ అంతా 'మహా' అనే అమ్మాయి చుట్టూ నడుస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే అదే నిజమే అని తెలిసిపోతుంది. అజయ్‌ భూపతి డ్రీమ్‌ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top