Prabhas: ‘ఆదిపురుష్‌’ క్రేజీ అప్‌డేట్‌.. కీలక పా‍త్రలో స్టార్‌ హీరో | Adipurush Latest Update: Kicha Sudeep To Play Key Role In Prabhas Movie | Sakshi
Sakshi News home page

Prabhas: ‘ఆదిపురుష్‌’ క్రేజీ అప్‌డేట్‌.. కీలక పా‍త్రలో స్టార్‌ హీరో

May 5 2021 10:55 AM | Updated on May 5 2021 11:37 AM

Adipurush Latest Update: Kicha Sudeep To Play Key Role In Prabhas Movie			 - Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించనున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుంది. ముంబైలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ రూమర్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ ఈ మూవీలో నటించబోతున్నారని సమాచారం. తనది పాజిటివ్‌ రోల్‌ అని తెలుస్తోంది. రావణుడి తమ్ముడు విభీషణుడి ప్రాతలో సదీప్‌ నటించబోతున్నాడని సమాచారం.  కాగా, గతంలో ‘బాహుబలి’లో ప్రభాస్‌తో కలిసి సుదీప్‌ నటిం‍చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈగ, సన్నాఫ్ సత్యనారాయణ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యాడు. ఎక్కువగా నెగెటీవ్‌ రోల్స్‌లో కనిపించే సుదీప్‌.. ఆదిపురుష్‌లో మాత్రం చాలా పాజిటివ్‌ పాత్రలో కనిపించబోతున్నాడట.


చదవండి:
త్రివిక్రమ్‌కు అసిస్టెంట్‌గా మారనున్న హిట్‌ డైరెక్టర్‌!
ఏడుపొస్తోంది రాహుల్‌.. నువ్వు ఎప్పటికీ స్పెషల్‌: అషూ

Advertisement
 
Advertisement
Advertisement