పండ‌క్కి గుడ్‌న్యూస్ చెప్పిన బుల్లితెర బ్యూటీ | Sakshi
Sakshi News home page

Surbhi Chandra: 13 ఏళ్లుగా ల‌వ్‌.. పెళ్లితో ఒక్క‌టికాబోతున్న బుల్లితెర జంట‌

Published Mon, Jan 15 2024 5:45 PM

Actress Surbhi Chandra Announces Wedding with Karan Sharma - Sakshi

బుల్లితెర న‌టి సుర‌భి చంద‌న గుడ్‌న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 13 ఏళ్లుగా ప్రియుడు, న‌టుడు క‌ర‌ణ్ శ‌ర్మ‌తో డేటింగ్‌లో ఉన్న ఆమె అత‌డితో క‌లిసి కొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ శుభ‌వార్త‌ను అభిమానుల‌తో పంచుకుంది. పెళ్లెప్పుడు? ఎక్క‌డ‌? అనే వివ‌రాల‌ను పూర్తిగా ప్ర‌క‌టించ‌లేదు.

పెళ్లితో ఒక్క‌టి కాబోతున్నారు
అయితే ఆమెకు పెళ్ల‌వ‌బోతున్న విష‌యాన్ని సుర‌భి పెంపుడు కుక్క చెప్తున్న‌ట్లుగా మై హ్యూమ‌న్స్ ఆర్ గెటింగ్ మారీడ్ (నా మ‌నుషులు పెళ్లితో ఒక్క‌టి కాబోతున్నారు) అని రాసి ఉన్న బోర్డు ముందు దిగిన ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 13 ఏళ్ల ప్రేమను పెళ్లి బంధంతో ప‌దిలం చేసుకోబోతున్న‌ ఈ ప్రేమ‌జంట‌కు అభిమానులు శుభాకాంక్ష‌లు చెప్తున్నారు. కాగా సుర‌భి హిందీ సూప‌ర్ హిట్ సీరియ‌ల్ 'తార‌క్ మెహ‌తా కా ఉల్టా చ‌ష్మా'లో అతిథి పాత్ర‌లో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియ‌ల్‌లో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది.

ఇద్ద‌రికీ సీరియ‌ల్స్ ద్వారానే క్రేజ్‌
'ఇష్క్‌బాజ్‌', 'సంజీవ‌ని', 'నాగిన్ 5', 'హున‌ర్బాజ్‌:  దేశ్ కీ షాన్‌', 'షెర్డిల్ షెర్గిల్' సీరియ‌ల్స్‌లో న‌టించింది. 'బాబీ జాసూస్' అనే  హిందీ మూవీలో అతిథి పాత్ర‌లో మెరిసింది. ఇది ఆమె వెండితెర‌పై న‌టించిన ఏకైక సినిమా! క‌ర‌ణ్ శ‌ర్మ విషయానికి వ‌స్తే ఇత‌డు కూడా చాలా ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో న‌టుడిగా రాణిస్తున్నాడు. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'ప‌విత్ర రిష్తా' వంటి సీరియ‌ల్స్‌తో గుర్తింపు పొందాడు. ప్ర‌స్తుతం 'ఉదారియ‌న్' అనే సీరియ‌ల్ చేస్తున్నాడు.

చ‌ద‌వండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా?

whatsapp channel

Advertisement
 
Advertisement