
సీనీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం సినిమారంగంలోనే కాదు.. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే సినీరంగంలో ఇలాంటివీ ఇంకాస్తా ఎక్కువగా ఉంటాయనే వార్తలు వింటుంటాం. తాజాగా మరోసారి క్యాస్టింగ్ కౌచ్ గురించి చర్చ మొదలైంది. ఏకంగా వీడియో బయటికి రావడంతో ఇంతకీ ఎవరు ఆమె అని నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
అయితే తాజాగా కోలీవుడ్ యంగ్ హీరోయిన్ శృతి నారాయణన్ ప్రైవేట్ వీడియో లీకైందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఓ ప్రైవేట్ ఆడిషన్ సమయంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతుండగా ఆ వీడియోను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దాదాపు 14 నిమిషాల వీడియో నెట్టింట వైరల్ కావడంతో కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రైవేట్ వీడియో లీక్ కావడంతో కోలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ వీడియోపై ఇప్పటి వరకు శృతి నారాయణన్ స్పందించలేదు. అసలు ఆ వీడియోలో ఉన్నది ఆమెనా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.
వీడియో లీక్ తర్వాత మొదటి పోస్ట్..
అయితే ఈ వీడియో లీక్ తర్వాత శృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌గా మార్చేసింది. అయితే కొద్ది సేపటికే వెంటనే మళ్లీ తన అకౌంట్‌ను పబ్లిక్‌గా మార్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత మొదటి పోస్ట్‌ను షేర్ చేసింది. బంగారు వర్ణం చీరలో ఉన్న ఫోటోలను పంచుకుంది.
కాగా.. శృతి నారాయణన్ తమిళ టీవీ సీరియల్స్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. 'సిరగదిక్క ఆసై' వంటి సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. జనవరి 2023లో ప్రారంభమైన ఈ షోలో వెట్రి వసంత్‌తో పాటు గోమతి ప్రియ నటించారు.