రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు!

Actress Radhika Reacts On Male acter and Female Acter - Sakshi

హీరోలకు పారితోషికం ఎక్కువ ఉంటుంది. వారితో పోలిస్తే – హీరోయిన్లకు చాలా తక్కువ ఉంటుంది. ఇక వయసు విషయానికొస్తే.. హీరో ఎప్పటికీ హీరోనే! 50 – 60 ఏళ్లు దాటినా హీరోగా చేయొచ్చు. కానీ హీరోయిన్‌కు 30 మహా అయితే 40 టచ్‌ అయ్యేవరకూ ఓకే. అది కూడా ఏ కొందరో 30 దాటినా హీరోయిన్లుగా చేయగలుగుతారు. చాలామటుకు 30 టచ్‌ అయ్యాక అక్కా, వదిన పాత్రలకు అడుగుతారు. 40 దాటితే అమ్మ పాత్రలు ఆఫర్‌ చేస్తారు. మేల్‌ యాక్టర్, ఫీమేల్‌ యాక్టర్‌కి ఉన్న ఈ వ్యత్యాసం గురించి ఓ కార్యక్రమంలో నటి రాధిక మాట్లాడుతూ – ‘‘నేను ఒకవైపు సినిమాల్లో నటించడంతో పాటు బిజినెస్‌ ఉమన్‌ (సినిమా, సీరియల్‌ నిర్మాణం) గానూ మారాను. ఎందుకంటే నా కెరీర్‌ నా కంట్రోల్‌లో ఉండాలనుకున్నాను.

భవిష్యత్తులో నన్ను రజనీకాంత్‌కి అమ్మ (రజనీ సరసన తమిళంలో పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో కథానాయికగా నటించారు రాధిక)గా చేయమని అడుగుతారని నాకు ముందే తెలుసు. నటుల విషయంలో ఎవరికీ ఎలాంటి ముందస్తు ఆలోచనలు ఉండవు. కానీ నటీమణుల విషయంలో మాత్రం కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి. ఏది ఏమైనా  కెరీర్‌ పరంగా దాటుతున్న ప్రతి మైలురాయికీ నేనింకా బెటర్‌ అవుతున్నాను’’ అన్నారు. కథానాయికగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ – ‘‘చూసేవారికి నా కెరీర్‌ చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ఈ జర్నీ అంత సులభంగా సాగలేదు. ఎన్నో కష్టాలున్నాయి. అసలు నేను యాక్టర్‌ అవ్వాలని అనుకోలేదు. ఒక డైరెక్టర్‌ నన్ను నటించమని అడిగారు. నేను లెజండరీ యాక్టర్‌ ఎం.ఆర్‌. రాధ కూతుర్ని అని ఆయనకు తెలియదు. వాస్తవానికి నేనప్పుడు అంత అందంగా కూడా ఉండేదాన్ని కాదు. ‘నా ముఖాన్ని ఎవరు చూస్తారు’ అని ఆయనతో అన్నాను. ఎలాంటి అంచనాలు, కలలు లేకుండానే కెమెరా ముందుకొచ్చాను. ఇంతదాకా వచ్చేశాను’’ అన్నారు రాధిక.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top