గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు | Actress Raadhika Sarathkumar meets legendary director K Viswanath | Sakshi
Sakshi News home page

గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు

Feb 7 2021 12:08 AM | Updated on Feb 7 2021 10:30 AM

Actress Raadhika Sarathkumar meets legendary director K Viswanath - Sakshi

కె.విశ్వనాథ్‌తో....

ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్‌ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు అందించారు. ఆయన డైరెక్ట్‌ చేసిన ‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు రాధిక. తనకు రెండు అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకుడిని కలిశారామె. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు రాధిక. దర్శకులు విశ్వనాథ్‌ను ఆయన స్వగృహంలో కలిశారామె. ఈ సందర్భంగా దిగిన ఫొటోను షేర్‌ చేసి, ‘‘విశ్వనాథ్‌గారు నాకు గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు ఇచ్చారు. ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక లెజెండ్‌. విశ్వనాథ్‌గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అన్నారు రాధిక.

‘స్వాతిముత్యం’ లొకేషన్‌లో...

Advertisement
 
Advertisement
Advertisement