ప్రగతి ఉడుంపట్టు.. ఈసారి సిల్వర్‌ మెడల్‌.. | Sakshi
Sakshi News home page

Pragathi: వెయిట్‌ లిఫ్టింగ్‌.. అవార్డు సాధించిన సినీ నటి ప్రగతి

Published Mon, Jan 22 2024 1:19 PM

Actress Pragathi Won Silver Medal In South India Powerlifting Competition 2024 - Sakshi

సీనియర్‌ నటి ప్రగతి ఎన్నో సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా జర్నీ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత మాత్రం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే స్థిరపడిపోయింది. తల్లి, వదిన, అత్త పాత్రల్లో కనిపించి కనువిందు చేసింది. అయితే ఈ మధ్య సినిమాల జోరు తగ్గించేసిన ఈమె ఫిట్‌నెస్‌పైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది. మరీ ముఖ్యంగా జిమ్‌లో బరువులు ఎత్తుతూ ఆ వీడియోలు షేర్‌ చేసేది.

ఇది చూసిన జనాలు.. ఎప్పుడు చూసినా ఆ జిమ్‌లో ఉంటుందేంటి? అనుకునేవారు. కట్‌ చేస్తే మొన్నామధ్య బెంగళూరులో 28వ బెంచ్‌ ప్రెస్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. కేవలం పార్టిసిపేట్‌ చేయడమే కాదు ఏకంగా మూడోస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా వెయిట్‌ లిఫ్టింగ్‌లో మరో అవార్డు సాధించింది ప్రగతి. సౌత్‌ ఇండియా పవర్‌ లిఫ్టింగ్‌ కాంపిటీషన్‌లో రెండో స్థానంలో నిలిచింది.

వెండి పతకాన్ని అందుకున్నానోచ్‌ అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది నటి. అందులో బరువులు ఎత్తిన నటి తర్వాత సిల్వర్‌ మెడల్‌ అందుకుంది. ఇది చూసిన అభిమానులు ప్రగతికి హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెయిట్‌ లిఫ్టింగ్‌పై పట్టు సాధిస్తూ అవార్డులు కొల్లగొట్టడం అంత ఈజీ కాదని పొగుడుతున్నారు.

చదవండి: ఫోన్‌ చేస్తే స్పందన లేదు.. సోహైల్‌ అనగానే కట్‌..

whatsapp channel

Advertisement
 
Advertisement