నటిపై దారుణంగా ట్రోల్స్.. దెబ్బకు బంద్ చేసింది..!

Actress Palak Tiwari Gets Trolled By Netizens Her Instagram Photos - Sakshi

బాలీవుడ్‌ టెలివిజన్‌ స్టార్‌ శ్వేత తివారీ ముద్దుల కూతురు పాలక్‌ తివారి. సోషల్‌ మీడియాలో ఎ‍ప్పుడు యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని హాట్ ఫోటోలను పంచుకున్నారు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..
పాలక్ తివారీ తాజాగా ఇన్‌స్టాలో కాస్తా బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది. ఇవీ చూసిన కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొందరేమో మీరు చాలా అందంగా ఉన్నారంటూ పోస్ట్ చేయగా.. మరికొందరు మాత్రం చాలా దారుణంగా కామెంట్స్ పెట్టారు. దీంతో నెటిజన్స్ చేసిన పనికి పాలక్ తివారీ కొపమొచ్చింది. వెంటనే కామెంట్స్‌ను ఆఫ్‌ చేసేసింది. 

విషయమేమిటంటే పాలక్‌ తివారీ తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని హాట్‌ ఫొటోలు పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలు వైరలయ్యాయి. వాటిని చూసిన కొందరు యూజర్లు అందంగా ఉన్నావంటూ పొగడగా.. మరికొందరు మాత్రం దారుణంగా నెగెటివ్‌ కామెంట్స్‌ పెట్టారు. దీంతో ఆమె కొంతసేపటికే కామెంట్స్‌ను ఆఫ్‌ చేసింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై కూడా ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 

కాగా.. బిజ్లీ బిజ్లీ మ్యూజిక్‌ వీడియోతో ఫేమ్ సంపాదించకుంది పాలక్ తివారీ. ప్రస్తుతం  సల్మాన్‌ ఖాన్‌ మూవీ ‘కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌’ కనిపించనుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్‌నాజ్‌ గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top