Actress Ileana D Cruz Hospitalized And Give Health Update On Her Instagram - Sakshi
Sakshi News home page

Ileana D Cruz Health Condition: ఇలియానకు అస్వస్థత, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరోయిన్‌

Jan 30 2023 4:31 PM | Updated on Jan 30 2023 5:28 PM

Actress Ileana D Cruz Hospitalized And Give Health Update on Her Instagram - Sakshi

ఇలియానా.. టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణించింది గోవా బ్యూటీ. ‘దేవదాస్‌’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె పోకిరి మూవీతో మంచి గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైన ఇలియాన సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్‌ ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది ఫ్యాన్స్‌కి చేరువుగా ఉంటుంది. అయితే తాజాగా ఇలియాన తీవ్ర అస్వస్థతకు గురైంది.

కనీసం ఆహారం తీసుకోలే స్థితిలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. తాజాగా తన హెల్త్‌ గురించి సోషల్‌ మీడియాలో ఇలియాన అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్‌ చేసింది. తాను ఆహారం తీసుకోలేని స్థితి ఉండగా వైద్యులు మూడు బాటిళ్ల సలైన్స్‌ ఎక్కించినట్లు ఈ సందర్భంగా చెప్పింది. తన పోస్ట్‌లో ఒక్క రోజులో ఎంత మార్పు అంటూ చేతికి సలైన్‌ ఎక్కిస్తున్న ఫొటోని షేర్‌ చేసింది.

ఇక మరో ఫొటోకి.. డాక్టర్లు తనని బాగా ట్రీట్‌ చేస్తున్నారని, 3 బ్యాగ్స్‌ ఐవీ లిక్విడ్స్‌ ఇచ్చినట్లు క్యాప్షన్‌ ఇచ్చింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్‌, సన్నిహితులను ఉద్దేశిస్తూ ఆమె మరో పోస్ట్‌ షేర్‌ చేసింది. ‘అందరూ నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఇంతగా నాపై ప్రేమ, అప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞుతురాలిని. ఇప్పుడ నేను బాగానే ఉన్నాను. నాకు మంచి వైద్యం అందుతోంది’’ అని పేర్కొంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ ఆకాంక్షిస్తున్నారు. 

చదవండి: 
నా కూతురికి దూరంగా ఉండాల్సి వస్తోంది : ప్రణిత ఎమోషనల్‌
ఆ భయంతోనే అజిత్‌ సినిమాను వదులుకున్నాను: జయసుధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement