Archana On Magadheera Movie: రాజమౌళి మగధీరలో ఆఫర్‌ ఇచ్చారు, కానీ నేనే..

Actress Archana Says She Rejected Magadheera Movie Offer - Sakshi

హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన అర్చన ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొని బుల్లితెర ప్రేక్షకులక సైతం చేరువైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమాలో తాను బాలకృష్ణకు డ్యాన్స్‌ నేర్పించానంది. బాలయ్య బృందావనంలో గోపికలతో కలిసి డ్యాన్స్‌ చేసే ఒక బిట్‌ నేర్పించినట్లు వెల్లడించింది.

ఇక పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్లిన తాను పెగ్గులు ఎక్కువవడంతో ఆసుపత్రికి వెళ్లానని చెప్పింది. రాజమౌళిగారు మగధీరలో చేయమని ఆఫర్‌ ఇచ్చారు, కానీ అప్పుడంత లౌక్యం లేకపోవడంతో చేయలేదని తెలిపింది. నిజంగా ఆ సినిమా చేసుంటే ఇప్పుడు ఇంకోలా ఉండేదేమోనని పేర్కొంది. కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయంటూ ఎమోషనలైంది అర్చన.

చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ
 పావురాల వ్యర్థాల వల్లే మీనా భర్త మృతిచెందాడా?..షాకింగ్‌ రీజన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top